ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన యూరప్ పర్యటనను కొనసాగిస్తున్న సంగతి తెలసిందే. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. 1993లో నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నుండి తిరిగి వస్తుండగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఆగిపోయినప్పుడు తీసిన ఫొటో అది. ప్రధాని ఇప్పుడు మరోసారి జర్మనీ వెళ్లిన సందర్బంగా ఈ ఫొటో వైరల్ అవుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటన నిన్నటితో మొదలైంది. ఇందులో భాగంగా ఆయన తొలుత జర్మనీ చేరుకున్నారు. యూరప్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ నుంచి జర్మనీకి బయలుదేరారు. ప్రధానమంత్రి కార్యాలయం ఓ ట్వీట్లో ఈ విషయం వెల్లడించింది.
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాని యూరప్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కోవిడ్ విజృంభణ తర్వాత రెండేళ్లలో తొలిసారి విదేశాల్లో మోదీ పర్యటిస్తున్నారు. ప్రధాని తన జర్మనీ పర్యటనలో భాగంగా చాన్సలర్ ఓలాష్ షోల్జ్‌తో భేటీ అవుతారు. 3వ తేదీన డెన్మార్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్తో ద్వైపాక్షిక భేటీ జరుపుతారు. 4న ఇండియా-నార్డిక్ రెండో సదస్సులో పాల్గొంటారు. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ అవుతారు.