Banner

బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ 36వ ఫౌండేషన్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్

సైన్స్ సులభతర నిర్వహణకు కొత్త మార్గదర్శకాల విడుదల: “తక్కువ ప్రభుత్వం ఎక్కువ పాలన” దిశగా

రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్ సదస్సును కూడా ప్రారంభించిన మంత్రి

కేంద్ర విదేశాంగ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ అండ్ టెక్నాలజీ; స్టేట్ మినిస్టర్ (ఇండిపెండెంట్ ఛార్జ్) ఎర్త్ సైన్సెస్; ఎంఒఎస్ పిఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు శక్తి మరియు అంతరిక్షం, డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, విదేశాలనుంచి తిరిగి స్వదేశం రావాలనుకుంటున్న అనేక మంది భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్తలతో ఒక విధమైన రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ ను భారత్ నేడు చూస్తోందని, ఈ ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృష్టించిన సానుకూల పరిస్థితుల వ్యవస్థకు చెందుతుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ సహాయ (స్వతంత్ర హోదా ) మంత్రి, ఎర్త్ సైన్సెస్ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి , పిఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు శక్తి అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

హర్యానాలోని ఫరీదాబాద్ లో రీజనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీలో బయోటెక్నాలజీ విభాగం 36వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

సైన్స్ నిర్వహణను సులభతరం చేయడానికి కొత్త మార్గదర్శకాలను ; “తక్కువ ప్రభుత్వం – ఎక్కువ పాలన” దిశగా; ఇంకా రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్ డైరెక్టరీ నీ మంత్రి విడుదల చేశారు. రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్ సదస్సును కూడా

ప్రారంభించారు. రామలింగస్వామి రీ ఎంట్రీ ఫెలోషిప్ అనేది బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ ప్రతిష్టాత్మక పథకం, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలను తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో 2006-07లో దీనిని ప్రారంభించారు.

36వ ఫౌండేషన్ డే సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ ను అభినందించారు. గత 36 సంవత్సరాలుగా డిబిటి దేశవ్యాప్తంగా బయోటెక్నాలజీ పరిశోధన , అభివృద్ధి, విద్య ఆవిష్కరణలపై ప్రభావం చూపిందని ఆయన చెప్పారు.

బయోటెక్నాలజీ విభాగం (డిబిటి) తన శక్తియుక్తులు ఏమిటో ప్రపంచానికి చూపడానికి కోవిడ్ ను అవకాశంగా ఉపయోగించుకుందని మంత్రి అన్నారు. బయోటెక్నాలజీకి సంబంధించిన అన్ని అంశాల అభివృద్ధికి ఈ శాఖ దోహదపడిందని, బయోటెక్నాలజీలో ఉత్తమమైనది ఇంకా రాలేదని ఆయన అన్నారు.

ప్రాథమిక, ప్రారంభ , ఆలస్య అనువాద పరిశోధన , వ్యవస్థాపకత్వాన్ని సులభతరం చేయడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా బయోటెక్నాలజీని ప్రోత్సహించడం పెంపొందించే లక్ష్యాన్ని డిబిటి కలిగి ఉందని, బయోటెక్నాలజీ కి సంబంధించిన అన్ని రంగాలలో విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడం కూడా దీని బాధ్యత అని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ప్రొడక్ట్ డెవలప్ మెంట్ కు, మానవ వనరులు , మౌలిక సదుపాయాలు రెండింటిలోనూ సామర్థాల పెంపునకు, జాతీయ, అంతర్జాతీయ భాగస్వామ్యాల ఏర్పాటుకు దారితీసే పరిశోధన, సృజనాత్మకత , టెక్నాలజీని ప్రోత్సహించడం ద్వారా ఇది సాధ్యమవుతోంది.

డిబిటి దేశవ్యాప్తంగా 15 థీమ్ ఆధారిత స్వయంప్రతిపత్తి సంస్థలను కూడా ఏర్పాటు చేసిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీ లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ అనే ఒక అంతర్జాతీయ ఆ సంస్థ, బి ఐ బి సి ఓ ఎల్, బి ఐ ఆర్ ఎ సి అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా బయోలాజికల్స్ తయారీ స్టార్టప్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ను పెంపొందించడానికి ఏర్పాటు చేసింది.

కోవిడ్-19 మహమ్మారి తీవ్రత ను తగ్గించే దిశగా డిబిటి నిర్వహించిన ప్రశంసనీయమైన పాత్రను కూడా కేంద్ర మంత్రి వివరించారు ముఖ్యంగా మిషన్ కోవిడ్ సురక్షా కింద, కోవిడ్-19 కివ్యతిరేకంగా వ్యాక్సిన్ల అభివృద్ధి దిశగా డిబిటి కీలక పాత్ర పోషించింది.

భారతదేశంలో బయోటెక్నాలజీ రంగం గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధి చెందిందని, ఆరోగ్యం, వ్యవసాయం మొదలైన వివిధ రంగాలలో గణనీయమైన సహకారం అందించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.ప్రభుత్వ ,ప్రైవేమరియుట్ రంగం నుండి అపారమైన మద్దతు లభించడం వల్ల, బయోటెక్నాలజీ రంగం వేగవంతమైన వృద్ధిని చూసింది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని టాప్ 12 బయోటెక్నాలజీ గమ్యస్థానాలలో రేటింగ్ పొందుతోంది.

.

ఈ సందర్భంగా మౌంట్ ఎవరెస్ట్ ను రెండుసార్లు అధిరోహించిన మొదటి మహిళ పద్మ సంతోష్ యాదవ్ డిబిటి ఫౌండేషన్ డే ప్రసంగం చేశారు. పర్వతారోహణలో అనుభవాలను,సవాళ్లను ఆమె శాస్త్రవేత్తలు , తోటివారితో పంచుకున్నారు.

Courtesy :Press Information Bureau , GOI

Banner
Similar Posts

రూ. 1,364.88 కోట్ల ఆర్థిక వ్య‌యంతో ఇమ్మిగ్రేష‌న్ వీసా ఫారిన‌ర్స్ రిజిస్ట్రేష‌న్ ట్రాకింగ్ ( విదేశీయుల వ‌ల‌స వీసా న‌మోదు ప‌ద్ధ‌తి – ఐవిఎఫ్ఆర్‌టి) ప‌థ‌కాన్ని మార్చి, 31, 2021 కాల‌ప‌రిమితిని ఐదేళ్ళ‌పాటు – ఏప్రిల్ 1, 2021 నుంచి మార్చి 31, 2026 వ‌ర‌కు పొడిగించేందుకు ఆమోద ముద్ర వేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం

Latest Posts from prapancham.com