ప్రపంచంలో మొత్తం దేశాలు ఎన్ని ? అందులో రెప్యుటేషన్ కలిగినవి ఏవి?

ప్రపంచంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అనే ప్రశ్నకు ఏ ఒక్కరూ సరైన సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ఖచ్చితమైన దేశాల సంఖ్యపై ఇప్పటికి ఎక్కడా స్పష్టమైన క్లారిటీ లేదు. ఐక్యరాజ్యసమితిలోసైతం ఈ విషయమై  కొన్ని అనుమానాలున్నాయి.మనకు లభించే ఇన్ఫో ప్రకారం కొన్ని చోట్ల 192 అని, మరొకొన్ని చోట్ల 194 అని, కొందరు 195, మరి కొందరు 196 ఇలా ఈ సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. 
దానికి కారణం చిన్న చిన్న ప్రదేశాలు సైతం కొత్తగా తామొక దేశంగా ఏర్పడ్డామని ప్రకటనలు చేయటం. ఈ మధ్యకాలంలో   లిబర్‌ల్యాండ్‌ అనే ఒక చిన్న దేశం ఏర్పడింది. అలాగే…  ‘ఎన్‌క్లావా’ అనే మరో దేశం ఏర్పడింది.  ఈ దేశాలు రెండు  కూడా వారి ఇంతకుముందు కలిసి ఉన్న దేశాల అధికారుల పెత్తనాన్ని సహించలేకే, వాటి నుంచి ఏర్పడిన దేశాలే కావటం విశేషం.   మొత్తం దేశాలలో కేవలం ‘’’193’’’ మాత్రమే పూర్తిగా ‘’’స్వాధిపత్యం కలిగిన దేశాలు (sovereign state) అని చెప్పాలి. 
ఇక ఈ దేశాల్లో అథ్యథికంగా  రిప్యుటేషన్ (కీర్తి) కలిగినదిగా స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది. ఎగుమతుల్లో అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, ప్రజల్లో ఎంతో సంయమనం, అత్యున్నత జీవన ప్రమాణాలు, తక్కువ క్రైమ్ రేట్, సుందరమైన నగరాలు, మైల్డ్ వాతావరణంతో ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ అంశాల్లో ఈ దేశాన్ని ఇప్పట్లో అధిగమించడం ఏ దేశం వల్ల సాధ్యమయ్యేది కాదు. అలాగే కెనడా రెండో స్థానంలో నిలిచింది. బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత. వివిధ దేశాల వలసలకు ఆకర్షణీయమైన దేశం. ప్రజల్లో సంయమనం ఎక్కువ. స్విట్జర్లాండ్ మూడో స్థానంలో నిలిచింది. యూరోపియన్ యూనియన్‌లో సభ్య దేశంకాకపోయినప్పటికీ యూరప్‌కు ఇది గుండెకాయ లాంటిది. బ్యాంకులకు ప్రసిద్ధి. ఉన్నత జీవన ప్రమాణాలు. ఆల్ఫ్స్ పర్వతాల్లో స్కీయింగ్ క్రీడలు వివిధ దేశాల వారిని విశేషంగా ఆకర్షిస్తాయి.